గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల(Candidates) కోసం BC స్టడీ సర్కిల్ ఉచిత కోచింగ్ ఇవ్వనుంది. కోచింగ్ తీసుకుంటున్న సమయంలో నెలకు రూ.5,000 చొప్పున స్టైఫండ్ అందజేస్తుంటుంది. మెయిన్స్ కు అర్హత(Eligible) సాధించినవారు ఇందుకోసం అప్లయ్ చేసుకోవాలని సూచించింది.
ఎప్పుడంటే…
తెలంగాణ BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈనెల 22(2024 జులై 22) నుంచి 75 రోజుల పాటు ఖమ్మంలో కోచింగ్ ఇస్తున్నట్లు డైరెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హత గలవారు ఈ నెల 10 నుంచి 19 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సెలక్షన్ నిర్వహిస్తారు.
www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా అప్లయ్ చేసుకోవడంతోపాటు మిగతా వివరాల్ని పరిశీలించవచ్చు. మరింత సమాచారం కోసం 040-24071178 ఫోన్ నంబరును సంప్రదించవచ్చని స్టడీ సర్కిల్ ప్రకటన విడుదల చేసింది.