ప్రభుత్వ విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది. అత్యుత్తమ సేవలందించిన వారిని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ‘బెస్ట్ టీచర్’లుగా ఎంపిక చేసింది. 6 విభాగాల్లో 161 ప్రతిపాదనలు రాగా, 49 మంది అవార్డులకు ఎంపికయ్యారు. ఇక మొత్తంగా పాఠశాల విద్యాశాఖలో 57 మంది, ఇంటర్ విద్యలో 11 మంది, వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో 60 మంది ఎంపికయ్యారు. CM రేవంత్ రేపు పురస్కారాలు ప్రదానం చేస్తారు.
ఈ కేటగిరీల్లో ఇంతమందికి…
GHM/ ప్రిన్సిపల్…: 10
SA/PD/LFL…: 21
SGT/PET/LP/TGT…: 12
ఎయిడెడ్ స్కూల్స్…: 03
మోడల్ స్కూల్స్…: 02
కేజీబీవీలు…: 1