భూ సమస్యలు పరిష్కరించేందుకు గాను ‘భూ భారతి’ చట్టాన్ని ప్రభుత్వం ఇక గ్రామాల్లో అమలు చేయనుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి అధికారులు పల్లెల్లో పర్యటిస్తారు. 10 వేలకు పైగా గ్రామాలకు అధికారుల్ని కేటాయిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 28 మండలాల్లోని 28 గ్రామాల్లో ‘భూ భారతి’ పైలెట్ ప్రాజెక్టు తెస్తే, అందులో ఎక్కువగా సాదా బైనామాల సమస్యలే ఉన్నాయన్నారు.