
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో KTRపై విచారణకు గవర్నర్ అనుమతిచ్చారు. రూ.54.88 కోట్ల కేసులో ACB విచారించనుంది. A-2గా IAS అర్వింద్ కుమార్ ను విచారించాల్సి ఉండగా, కేంద్రం అనుమతివ్వాలి. A-1 KTR ఇప్పటికే 4 సార్లు ACB ముందుకు వచ్చారు. కేబినెట్ అనుమతి లేకుండా, మున్సిపల్ మంత్రిగా ఎన్నికల కోడ్ లోనూ నిధులు మళ్లించారన్నది అభియోగం. అవినీతి నిరోధక చట్టం ప్రకారం ప్రజాప్రతినిధులపై కేసులకు గవర్నర్ అనుమతి తప్పనిసరి.