చిన్నారులు(Children), గర్భిణులు(Pregnants), బాలింతలకు పౌష్ఠికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీలు.. పారదర్శకం(Transparent)గా పనిచేయాలన్న కోణంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టబోతున్నది. అన్ని సెంటర్లలో బయోమెట్రిక్ సిస్టమ్ అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై రివ్యూ నిర్వహించిన CM… రక్తహీనతతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అనారోగ్యం పాలవుతున్నట్లు జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే నివేదికలోని అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయని గుర్తు చేశారు.
ఆకర్షణీయంగా డిజైన్లతో…
చూడముచ్చటగా ఉండేలా ఆకర్షణీయ డిజైన్లతో అంగన్వాడీ కేంద్రాలను ఆధునికీకరించాలన్న(Modification) CM.. విద్య, ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. అందరికీ పౌష్ఠికాహారం అందడం లేదని, కేవలం రికార్డుల్లో రాసుకుని పేదలకు అందాల్సినదాన్ని పక్కదారి పట్టిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 35 వేల కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బయోమెట్రిక్ అమలు చేస్తేనే అంగన్వాడీలు సక్రమంగా పనిచేస్తాయని తెలిపారు. CC కెమెరాలతోపాటు ఆడిటింగ్(Auditing) కూడా ఉండాలన్నారు.
ప్రీ-ప్రైమరీ ఎడ్యుకేషన్ దిశగా…
అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైతే ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు ప్రీ-ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ను అందించేందుకు గల సాధ్యాసాధ్యాల(Possibilities)ను పరిశీలించాలని ఉన్నతాధికారులకు రేవంత్ సూచనలు చేశారు. ఉపాధి హామీ నిధులు వెచ్చించి తొలి ప్రాధాన్యతగా అంగన్వాడీ భవనాల నిర్మాణాలు చేపడతామన్న ముఖ్యమంత్రి.. రాష్ట్రమంతా ఎక్కడ చూసినా ఒకే డిజైన్ తో కూడిన బ్రాండింగ్ ఉండాలని స్పష్టం చేశారు.