
New Delhi: BJP supporters at the party headquarters to celebrate victory in UP and Uttrakhand Assembly elections, in New Delhi on Sunday. PTI Photo by Manvender Vashist(PTI3_12_2017_000210B)
తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. గత కొద్దిరోజులుగా పార్టీలో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితులపై జేపీ నడ్డా, అమిత్ షా దృష్టిసారించడంతో రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతల్ని దిల్లీకి పిలుస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మీట్ అయ్యారు. కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్న పరిణామాలతో స్టేట్ బీజేపీలో గందరగోళం నెలకొంది. పార్టీలో భారీగా చేరికలుంటాయని భావించినా అందుకు భిన్నంగా కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ లీడర్లలో అసంతృప్తి నెలకొందన్న వార్తలు గత కొద్దిరోజులుగా ఎక్కువయ్యాయి. నేతల తీరు ఇలాగే ఉంటే రానున్న ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవన్న భావనతో హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. మొన్నీమధ్యే బండి సంజయ్ సైతం దిల్లీలో అగ్రనేతల్ని కలుసుకున్నారు. పార్టీ అధ్యక్షుడి మార్పుపై ఊహాగానాలు నడుస్తున్న వేళ… ఇప్పుడు మరికొందరు ముఖ్య నేతల్ని దిల్లీకి పిలిపించడం చర్చనీయాంశంగా మారింది.

వెంటనే రెస్పాండ్ కావాలన్నాం
కన్నడ నాట ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో ఏదేదో మాట్లాడుకుంటున్నారని, కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో లేట్ కావడం వల్లే వ్యతిరేక ప్రచారం జరుగుతున్నట్లు హైకమాండ్ కు ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి వివరించారు. తెలంగాణలో బీజేపీని విశ్వసించాలంటే వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. గంటకు పైగా జరిగిన మీటింగ్ లో రాష్ట్ర పరిణామాలపై పూర్తిస్థాయిలో వివరించినట్లు ఈటల, కోమటిరెడ్డి తెలిపారు.