ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ అయిన మాజీ MLAను.. ఎయిర్ పోర్టులో అడుగుపెట్టగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మాజీ MLA, BRSకు చెందిన షకీల్(Shakeel) దుబాయ్ నుంచి శంషాబాద్ రాగానే అదుపులోకి తీసుకున్నారు. ఈయనపై రెండు కేసులు ఉన్నాయి. షకీల్ తనయుడు ప్రజాభవన్ ను కారుతో ఢీకొట్టిన ఘటనలో పంజాగుట్టలో కేసు నమోదైంది. దీన్నుంచి తప్పించేందుకు షకీల్ ప్రయత్నాలు చేశారన్నది పోలీసుల అభియోగం. గతంలో జూబ్లీహిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సైతం షకీల్ కుమారుడు కారణం కాగా, ఆ ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తల్లి అంత్యక్రియల కోసం ఈ మాజీ MLA రాష్ట్రానికి తిరిగివచ్చారు.