వరంగల్ లోని భద్రకాళి తాగునీటి చెరువుకు గండిపడటంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే వరంగల్ నగరం అస్తవ్యస్థం కాగా.. ఈ చెరువు తెగిపోవడంతో నీరు పలు కాలనీలను చుట్టుముట్టింది. చెరువు కెపాసిటీకి మించి వరద నీరు పోటెత్తడంతో పోతన నగర్ వైపున గల కట్ట ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో పోతన నగర్, రంగంపేట కాలనీలు నీటితో నిండిపోయాయి.
గండి పడ్డ విషయాన్ని గుర్తించి అధికారులు అక్కడకు చేరుకున్నారు. చుట్టూ ఉన్న ఏరియాల్లోని ప్రజలను సేఫ్ ప్లేసెస్ కు తరలించారు. గండి పడిన చోట మరమ్మతులు చేస్తున్నారు.