MLAలు ఒక్కరొక్కరే పార్టీని వీడుతూ ఇబ్బందికర పరిణామాలు తయారైన వేళ BRS పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ఐదుగురు శాసనసభ్యులు పార్టీని విడిచిపెట్టడం నాయకులు, కార్యకర్తల్ని అయోమయాని(Confusion)కి గురిచేస్తున్నది. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నది గులాబీ దళం. కానీ అంతలోనే ఆ పార్టీ చీఫ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ వివరాల్లో వెళ్తే…
ఉద్యమంలో…
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబరులో రైల్ రోకోకు KCR పిలుపినిచ్చారని అప్పట్లో పోలీసులు కేసు ఫైల్ చేశారు. దీనిపై ప్రజాప్రతినిధుల(Public Representatives) కోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ కేసును కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. రైల్ రోకోకు పిలుపే ఇవ్వలేదని, ఎవరో ఇచ్చిన వాంగ్మూలం(Statement) ఆధారంగా కేసులు నమోదు చేశారని పిటిషన్లో వివరించారు.
ఆ తర్వాతే…
KCR, కోదండరామ్, కవితతోపాటు 40 మంది రైలు పట్టాలపై బైఠాయించారని, రైళ్ల రాకపోకలు అంతరాయం, ఉద్యోగులకు ఆటంకం కలిగిందంటూ కేసు నమోదైంది. ఈ రైల్ రోకో తర్వాత మూడేళ్లకు తెలంగాణ ఏర్పడిందని తెలియజేసిన కేసీఆర్.. ఈ కార్యక్రమం విషయంలో తన పాత్ర ఏమీ లేనందున కేసు కొట్టివేయాలని అభ్యర్థించారు.