హైదరాబాద్ రాయదుర్గంలోని రాజ్ పాకాల ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది. జన్వాడ ఫాం హౌజ్ లో ఎక్సైజ్ అధికారులు దాడి చేసి డ్రగ్స్ వాడినట్లు గుర్తించి కేసు నమోదు చేయడంతో.. A2 అయిన రాజ్ పాకాల కోసం వేట కొనసాగుతున్నది. పరారీలో ఉన్న అతణ్ని పట్టుకునేందుకు రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ వద్దకు చేరుకున్న అధికారుల్ని గులాబీ పార్టీ MLAలు, MLCలు అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ మాగంటి గోపినాథ్, సంజయ్, వివేకానంద ప్రశ్నించారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో పెద్దయెత్తున పోలీసులు రావడంతో BRS నాయకులు, కార్యకర్తలు సైతం భారీగా అక్కడకు చేరుకున్నారు. KTR బావమరిది రాజ్ పాకాలను అదుపులోకి తీసుకునేందుకు అధికారులు రావడంతో ఆ పార్టీ నేతలు అడ్డుకున్నారు.