
బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలు కాగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘటన జరగ్గా టిప్పర్ లోని కంకర అందరిపైన పడి అందులో కూరుకుపోయారు. టర్నింగ్ పాయింట్లో టిప్పర్ స్పీడ్ కంట్రోల్ చేయలేకపోవడంతో బస్సుపైకి వచ్చిందని చెబుతున్నారు. బాధితులకు చేవెళ్ల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తెల్లవారుజామున 4:40 గంటలకు తాండూరు నుంచి బయల్దేరి హైదరాబాద్ వస్తుండగా 6 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. మృతుల్లో ఉద్యోగులు, విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. తెల్లవారుతుండగా జరిగిన దుర్ఘటన ఎంతోమంది బతుకులు తెల్లారిపోయేలా చేసింది. చేవెళ్ల ఆసుపత్రికి వెళ్లాలంటూ ఉన్నతాధికారుల్ని CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. కంకరలో కూరుకుపోయిన మృతదేహాల్ని వెలికితీస్తున్నారు. తొలుత 19 మంది చనిపోగా.. కొద్దిసేపటికే ఆ సంఖ్య 24కు చేరింది.