గత పదేళ్ల పాలనలో కేసీఆర్ సర్కారు వెచ్చించిన నిధులు, అమలు చేసిన పథకాల వివరాల్ని శ్వేతపత్రం(White Paper) ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందని కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కారు(New Government) ఏకగ్రీవంగా నిర్ణయించింది. 2014న BRS సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2023 డిసెంబరు 7 వరకు రాష్ట్రంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలు ప్రజలకు తెలియజేయాలని డిసైడ్ అయింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. ఆరు గ్యారెంటీల్ని అమలు చేసే ముందు గత సర్కారు అవలంబించిన విధానాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి రేవంత్ ఆధ్వర్యంలో సాగిన ఈ కేబినెట్ భేటీకి అన్ని శాఖల ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు.
ఈ పదేళ్ల కాలంలో ఏయే శాఖల్లో ఎన్ని కార్యక్రమాలు అమలు చేశారు.. వాటికి వెచ్చించిన నిధులెంత అనే కోణంలో అన్ని డిపార్ట్ మెంట్ల నుంచి సమాచారంతో కూడిన నివేదిక రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కేబినెట్ ఆదేశించింది. ఈ మేరకు ఆమె అన్ని శాఖల ఇంఛార్జిలను ఆదేశిస్తూ వెంటనే లెక్కలు తేల్చే పడాలన్నారు.