కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. లబ్ధిదారుల అర్హతలు(Eligibility), ఇతర విధివిధానాల(Guidelines)ను పరిశీలించేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది.
పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛైర్మన్ గా.. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు.
రేషన్ కార్డులతోపాటు రాష్ట్రంలో కొత్తగా ఇవ్వబోయే హెల్త్ ప్రొఫైల్ కార్డులకు సంబంధించిన గైడ్ లైన్స్ నూ ఈ కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తుంది.