రాష్ట్రంలో ఎల్లుండి(శనివారం) ప్రభుత్వ విద్యాలయాలైన(Educational Institutions) పాఠశాలలు, గురుకులాలు, KGBVల బంద్ కు SFI పిలుపు ఇచ్చింది. ఫుడ్ పాయిజన్ ఘటనల్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. విద్యాలయాల్లో ఫుడ్ పాయిజన్ పై ప్రభుత్వ వైఖరికి నిరసనగానే రాష్ట్రవ్యాప్తంగా బంద్ పాటించాలని కోరింది. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాల్లో సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. నాణ్యమైన భోజనం అందించడంతోపాటు, ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని స్పష్టం చేసింది. దొడ్డుబియ్యాన్ని పాలిష్ ద్వారా సన్నబియ్యంగా మార్చి సప్లై చేస్తున్నారని ఆరోపిస్తూ వీటన్నింటిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించాలని SFI నాయకులు డిమాండ్ చేశారు.