ఆర్టీసీ(TGSRTC) భర్తీ చేయనున్న 3,035 ఉద్యోగాలకు గాను అభ్యర్థుల అర్హతల్ని(Qualifications) సంస్థ తెలియజేసింది. 10 విభాగాల్లో ఉద్యోగాల భర్తీ జరగనుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల నుంచే అభ్యర్థులు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు https://tgsrtc.telangana.gov.in/ సంప్రదించాల్సి ఉంటుంది.
ఆ అర్హతలివే…
పోస్ట్ | వయసు | అర్హత |
డ్రైవర్ | 18-40 | 8 నుంచి పదో తరగతి, తగిన డ్రైవింగ్ లైసెన్స్ |
శ్రామిక్ | 18-35 | 10 లేదా 12 తరగతితో తప్పనిసరి పాస్(గుర్తింపు పొందిన బోర్డు నుంచి) |
డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్) | 21-40 | బ్యాచిలర్ డిగ్రీ(మెకానికల్-గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి) |
డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్) | 21-35 | ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ |
డిపో మేనేజర్ | 21-35 | ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ |
అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్) | 21-35 | బ్యాచిలర్ డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్) |
అసిస్టెంట్ ఇంజినీర్(మెకానికల్) | 21-35 | బ్యాచిలర్ డిగ్రీ(మెకానికల్ ఇంజినీరింగ్) |
సెక్షన్ ఆఫీసర్ | 21-35 | బ్యాచిలర్ డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్)లో తప్పనిసరి పాస్ |
మెడికల్ ఆఫీసర్(జనరల్) | 21-40 | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBBS పట్టా |
మెడికల్ ఆఫీసర్(స్పెషలిస్ట్) | 21-45 | MBBS, సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్/డిప్లొమా |