ఎన్నికలు వస్తున్నాయంటే అందులో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ముందుగానే సమాచారం ఇస్తారు. EC ఆదేశాల మేరకు ప్రతి ఉద్యోగి తన బాధ్యతను పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల సంఘం ఆదేశాల్ని బేఖాతరు(Neglect) చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తాజా కేసును చూస్తే అర్థమవుతుంది. వివిధ కారణాల పేరిట ఎన్నికల్లో పాల్గొనని ఉద్యోగుల(Employees)పై చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు. డ్యూటీలకు డుమ్మా కొట్టిన 48 మందిపై కేసు ఫైల్ చేశారు.
దేవరకొండలో…
ఇలా నల్గొండ జిల్లా దేవరకొండలో 48 మంది ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల విధులకు గైర్హాజరైన(Absent) పలువురిపై అక్కడి RDO… రిటర్నింగ్ అధికారి(RO) అయిన కలెక్టర్ కు కంప్లయింట్ చేశారు. దీంతో సదరు ఉద్యోగులపై కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.