ఫార్ములా ఈ-రేస్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేరును A1గా చేరుస్తూ ACB అధికారులు కేసు నమోదు చేశారు. BRS హయాంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి(Principal Secretary)గా పనిచేసిన అర్వింద్ కుమార్ ను A2గా, HMDA చీఫ్ ఇంజినీర్ గా బాధ్యతలు నిర్వర్తించిన BLN రెడ్డిని A3గా చేర్చారు. మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేటీఆర్ పై కేసు ఫైల్ చేశారు. 13(1) A, 13(2) పీసీ యాక్ట్, 409, 120బీ కింద కేసులు నమోదయ్యాయి.
ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో RBI నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు రూ.55 కోట్లను HMDA బదలాయించడంపై ఆరోపణలు వచ్చాయి. కేటీఆర్ MLA అయినందున ఆయనపై విచారణకు ప్రభుత్వం.. గవర్నర్ అనుమతి తీసుకుంది. గవర్నర్ పర్మిషన్ తర్వాత ACBకి లేఖ రాశారు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి. దీంతో అన్ని అంశాల్ని పరిశీలించిన ACB.. కేటీఆర్, అర్వింద్ కుమార్ సహా పలువురిపై కేసులు నమోదు చేసింది. ఇక తర్వాతి అంకం(Part)లో ACB అధికారులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించే అవకాశాలున్నాయి.