రాష్ట్రంలో సంచలనం సృష్టించి నిరుద్యోగులను ఎటూకాకుండా చేసిన క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసును హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. TSPSC నిర్వహించాల్సిన ఎగ్జామ్స్ కు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కొద్ది నెలల క్రితం లీకవడం కలకలానికి కారణమైంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ను CBIకి అప్పగించాలన్న పిల్(Public Interested Litigation)పై హైకోర్టులో విచారణ నడిచింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(PIL)ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ప్రశ్నపత్రాల లీకేజీపై గతంలో కాంగ్రెస్ కు చెందిన బక్కా జడ్సన్ పిల్ దాఖలు చేశారు.
జడ్సన్ వేసిన పిటిషన్ పై రిజిస్ట్రీ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. వాటిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు 80 మంది నిందితులను సిట్(Special Investigation Team) అరెస్టు చేసి రిమాండ్ కు తరలించింది.