BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై నల్గొండ జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. టెన్త్ ప్రశ్న పత్రం బయటకు వచ్చిన ఘటనపై ‘X’లో పోస్టులు ఫార్వార్డ్ చేశారంటూ అక్కడి మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత ఫిర్యాదు ఇచ్చారు. A1గా మన్నె క్రిశాంక్, A2గా KTR, A3గా కొణతం దిలీప్ కుమార్ ఉన్నారు. నకిరేకల్ MLA వేముల వీరేశంపై అనుచితంగా పోస్టులు పెట్టారన్నది కంప్లయింట్. ఆయన అనుచరుడు ఉగ్గడి శ్రీనివాస్ ఇచ్చిన మరో ఫిర్యాదుపై KTRను A-3గా చేర్చారు. MLA ఇంకో అనుచరుడు నరేందర్ ఫిర్యాదుతో మాజీ మంత్రిని A-1గా చేర్చారు. ఇలా ఒకే కేసులో 3 ఫిర్యాదులు వచ్చాయి. BRS సోషల్ మీడియా పెట్టిన పోస్టుల్ని నిజాలు తెలుసుకోకుండా ఫార్వార్డ్ చేశారన్నది ఆరోపణ.