త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల(Loksabha Elections) కోసం ప్రలోభాలు పెద్దయెత్తున జరుగుతున్నాయి. నగదు, మందు, గిఫ్ట్ లతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా వారం క్రితం వరకు నాలుగున్నర వేల కోట్ల రూపాయలు పట్టుబడితే మన రాష్ట్రంలోనూ భారీగానే దొరికిపోతున్నది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ వందలాది కోట్లు(Hundreds Of Crores) ఎన్నికల అధికారులకు పట్టుబడ్డాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్లలోనూ అదే సీన్ కనపడుతున్నది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పట్టుబడింది రూ.155 కోట్ల విలువైన సొత్తు.
పట్టుబడినవి విలువ…
నగదు(Cash) రూ.61.11 కోట్లు
నగలు(Jewellery) రూ.19.16 కోట్లు
మద్యం(Liquor) రూ.28.92 కోట్లు
మత్తు పదార్థాలు(Drugs) రూ.23.87 కోట్లు
వస్తువులు(Other Items) రూ.22.77 కోట్లు