రాష్ట్రంలో మొత్తం 1.12 కోట్ల కుటుంబాల్లో 50 రోజుల పాటు నిర్వహించిన సర్వే వివరాల్ని ముఖ్యమంత్రి వెల్లడించారు. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ కుల సర్వే-2024 నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 96.9 శాతం కుటుంబాల్లో పూర్తి కాగా, సర్వే చేపట్టని ఫ్యామిలీలు 3.56 లక్షలు ఉన్నాయి. ముస్లిం మైనారిటీలు మినహా BC కులాల శాతం 46.25 కాగా, కోటీ 64 లక్షల 9 వేల 179 మంది ప్రజలున్నారు. SCల సంఖ్య 61 లక్షల 84 వేల 319 కాగా వారి శాతం 17.43గా ఉంది. STలు 37 లక్షల 5 వేల 929 మందికి గాను వీరి శాతం 10.45గా తేలింది. ముస్లిం మైనార్టీలు 12.56 శాతంతో 44 లక్షల 57 వేల 12 మంది ఉన్నారు.
OCల్లో 15.79 శాతంతో 56 లక్షల 1 వెయ్యి 539 మంది ఉన్నారు. ఇక ముస్లిం మైనార్టీల్లో BCలు 10.08%తో 35 లక్షల 76 వేల 588 మంది, ఓసీలు 2.48%తో 8 లక్షల 80 వేల 424 మంది ఉన్నారు. ముస్లిం మైనార్టీలు మినహాయిస్తే ఓసీలు 13.31%తో 47 లక్షల 21 వేల 115 మంది ఉన్నట్లు తేలింది.