రాష్ట్రంలో కులగణన(Caste Survey) తుది దశకు చేరిందని, 16 జిల్లాల్లో 100 శాతం పూర్తయిందని ప్రభుత్వం తెలిపింది. మరో 13 జిల్లాల్లో 99 శాతానికి చేరుకోగా, మంగళవారం నాటికి 1.10 కోట్ల ఇళ్లల్లో పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) శాంతికుమారి కార్యాలయం ప్రకటించింది. ఇందులో 20.86 లక్షల నివాసాల డేటా ఎంట్రీ కంప్లీట్ కాగా, రాష్ట్రవ్యాప్తంగా సర్వే 93.5 శాతానికి చేరుకుంది. మొత్తం 1.17 కోట్ల ఇళ్లను గుర్తిస్తే అందులో 1.10 కోట్ల నివాసాల్లో వివరాలు సేకరించారు. ఇక GHMC(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) పరిధిలో మాత్రం నిదానంగా నడుస్తుండగా ఇప్పటివరకు 78.3 శాతం పూర్తయింది.