ఇది అత్యంత అరుదైన విపత్తు అని.. వరదలు, వర్షాల వల్ల కలిగిన ఆస్తి నష్టం మామూలుగా లేదని కేంద్ర బృందం అభిప్రాయపడింది. ఈ భీకర నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తామని తెలిపింది. రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించిన టీమ్ సభ్యులు.. పర్యటన ముగిసిన తర్వాత CS శాంతికుమారితో భేటీ అయ్యారు. గోదావరి తీరంలోని 5 జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని రోడ్లు, బ్రిడ్జిలతోపాటు పంటలు మొత్తం నష్టపోయారని రిపోర్ట్ లో రాశారు. NDRF జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల టీమ్… వరద బాధిత జిల్లాల్లో విస్తృతంగా పర్యటించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వరంగల్ మహానగరం మొత్తం చెరువును తలపించింది. ఎక్కడికక్కడ చెరువులు తెగి జనం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ములుగు జిల్లాలో వాగులు పొంగి జనజీవనం అస్తవ్యస్థమైంది. ఆ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. వేలాదిమందికి కట్టుబట్టలు కూడా దక్కలేని దుస్థితిని సెంట్రల్ టీమ్ కళ్లారా చూసింది.