వృద్ధులు ఓటు వేసేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో వలంటీర్లను నియమిస్తున్నామని… వృద్ధులు, దివ్యాంగులకు ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కూడా కల్పిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(Chief Electoral Officer) వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల అక్రమాలపై సీవిజిల్ యాప్ లో కంప్లయింట్ చేయవచ్చన్నారు. ఈసారి పోలింగ్ కోసం మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ సెంటర్లు అందుబాటులో ఉంటాయని, ఏవైనా సమస్యలు ఉంటే 1950 నంబరుకు కాల్ చేయాలన్నారు.
రాత్రి 10 వరకే లౌడ్ స్పీకర్లు
రాత్రి 10 నుంచి పొద్దున 6 గంటల వరకు ఎలాంటి లౌడ్ స్పీకర్లకు పర్మిషన్ ఉండదని వికాస్ రాజ్ తెలిపారు. మీడియా అడ్వర్టయిజ్‌మెంట్స్ అన్నీ MCMC(Media Certification And Monitoring Committee) జిల్లా, రాష్ట్ర స్థాయి పర్యవేక్షణలో ఉంటాయన్నారు.