రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులకు నిర్వహించనున్న కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్ మెంట్ టెస్టు(CBRT) షెడ్యూల్ లో బోర్డు స్వల్ప మార్పులు చేసింది. తొలుత ఆగస్టు 1 నుంచి 22 వరకు పరీక్షలు జరుగుతాయని ప్రకటించగా.. తాజాగా దాన్ని 23 వరకు పెంచారు. ఎగ్జామ్స్ కు సంబంధించిన హాల్ టికెట్లు ఈ నెల 24 నుంచి అందుబాటులో ఉంటాయి. గురుకుల బోర్డు వెబ్ సైట్ లాగిన్ అయినపుడు అప్లయ్ చేసిన సబ్జెక్టుల పోస్టుల హాల్ టికెట్లు కనిపిస్తాయి. వాటిని ఒకేసారి డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించడంతోపాటు క్యాండిడేట్స్ కు SMSలు పంపిస్తారు. ఎగ్జామ్స్ తేదీలను అభ్యర్థులు మరోసారి చూసుకోవాలని, ప్రతి రోజు మూడు షిఫ్టుల్లో పరీక్షలు ఉంటాయని గురుకుల బోర్డు తెలిపింది.
మొదటి షిఫ్టు ఎగ్జామ్ ఉదయం 8:30 నుంచి 10:30 వరకు, రెండో షిఫ్టు 12:30 నుంచి 2:30 వరకు, మూడో షిఫ్టు ఎగ్జామ్ 4:30 నుంచి 6:30 వరకు జరుగుతుందని గురుకుల బోర్డు స్పష్టం చేసింది.