ప్రమాదవశాత్తూ రియాక్టర్ పేలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. కంపెనీ జనరల్ మేనేజర్ తోపాటు నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. హత్నూర మండలం చందాపూర్(Chandapur) శివారులోని SB ఆర్గానిక్స్ ఇండస్ట్రీలో కెమికల్ రియాక్టర్ పేలడంతో భయానక వాతావరణం ఏర్పడింది.
సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో పెద్దయెత్తున మంటలు, పొగ రావడంతో ఫైరింజన్లతో మంటల్ని ఆర్పారు. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందడమే కాకుండా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు చుట్టూ వ్యాపించడంతో పక్కనున్న మరిన్ని రియాక్టర్లు పేలే ప్రమాదమున్న దృష్ట్యా అక్కడ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.