రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(CEO) వికాస్ రాజ్ బదిలీ అయ్యారు. ఆయన్ను విధుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ఆర్డర్స్ ఇచ్చింది. 2022 మార్చిలో ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు చేపట్టారు.
వికాస్ రాజ్ స్థానంలో సీనియర్ అధికారి సుదర్శన్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం GAD ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. 1992 బ్యాచ్ కు చెందిన వికాస్ రాజ్ 2 సంవత్సరాల 3 నెలలకు పైగా CEO విధుల్లో ఉన్నారు. ఆధ్వర్యంలోనే శాసనసభ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి.