లోక్ సభ(Loksabha) ఎన్నికలు(Elections) ముంచుకొస్తున్న తరుణంలో పెద్దయెత్తున ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులకు స్థాన చలనం కల్పించక తప్పని పరిస్థితుల్లో వందల సంఖ్యలో బదిలీలు చేస్తున్నారు ఉన్నతాధికారులు. ఇవాళ ఒక్కరోజే మల్టీజోన్-II పరిధిలో 217 మందిని తాము పనిచేస్తున్న స్థానాల నుంచి తప్పించారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 123 మందికి స్థాన చలనం కల్పిస్తూ CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. పొద్దున 54 మందిని బదిలీ చేసిన CP.. మధ్యాహ్నానికి మరింత మందికి ఆర్డర్స్ ఇచ్చారు. అటు సైబరాబాద్ పరిధిలో 41 మందిని పంపిస్తూ ఆర్డర్స్ వచ్చాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను మినహాయిస్తే… మల్టీజోన్-II పరిధిలోని జిల్లాల్లో 53 మందిని ఉన్న చోటు నుంచి మరో చోటుకు పంపించారు.