విద్యార్థుల ఆందోళనతో ఉస్మానియా వర్సిటీ గరం గరంగా మారింది. నిరసనలు, ఆందోళనల్ని నిషేధిస్తూ విడుదలైన సర్క్యులర్ పై విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. వైస్ ఛాన్సలర్(Vice Chancellor)కు వ్యతిరేకంగా పెద్దసంఖ్యలో నినాదాలు చేశారు. ఐక్య విద్యార్థి సంఘాల కూటమి తరఫున ధర్నా జరగ్గా.. పెద్దయెత్తున పోలీసుల్ని మోహరించారు. ఆర్ట్స్ కళాశాల ఎదుట బైఠాయించిన విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.