Published 30 Dec 2023
పింఛన్లు, రైతుబంధు పథకాలపై అపోహలకు గురికావొద్దని పాత లబ్ధిదారులందరికీ ఇవి అందుతాయని, కేవలం కొత్తవాళ్లు మాత్రమే దరఖాస్తు(Apply) చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకూ లబ్ధి పొందకుండా కొత్తగా స్కీమ్ అందుకునేవారు మాత్రమే ఇందుకు అప్లై చేసుకోవాలన్నారు. ప్రజాపాలన తీరుపై ఉన్నతాధికారులతో CM రివ్యూ నిర్వహించారు. ఈ నెల 28 నుంచి మొదలైన ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులెన్ని, గ్రామసభల్లో అప్లికేషన్లు స్వీకరిస్తున్న విధానంపై అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు అవసరమైనన్ని అభయహస్తం దరఖాస్తులు అందుబాటులో ఉంచాలన్న ముఖ్యమంత్రి.. వాటిని అమ్మకానికి పెట్టడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దరఖాస్తుల్ని అమ్ముతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావొద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు అటెండ్ అయ్యారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని CM సూచించారు. ఈ సదస్సులకు ఏర్పాటు చేసే క్యాంపుల్లో తాగునీరు, టెంట్లు వంటివి సమకూర్చాలని ఆదేశాలిచ్చారు.