తెలంగాణ రాష్ట్రం ‘TS’ పేరును తాము అధికారంలోకి వస్తే ‘TG’గా మారుస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే సంక్షిప్త పదం ‘TS’ నుంచి ‘TG’గా మారుస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు(Orders) విడుదల చేశారు. శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి కేంద్రాలు, ఇతర సంస్థలన్నీ ఇక నుంచి ‘TG’నే వాడాల్సి ఉంటుంది.
అన్నింటికీ…
జీవోలు, నోటిఫికేషన్లు(Notifications) సహా అధికారిక దస్త్రాలన్నింటి(Files)నీ ‘TG’గానే సంబోధించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆర్టీసీ(TSRTC)గా కొనసాగుతున్న సంస్థ పేరు మారుతుందన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. ఏకంగా RTC లోగో మారుస్తున్నారన్న వార్తలతోపాటు సోషల్ మీడియాలో చక్కర్లు కూడా కొట్టింది. దీనిపై ఆ సంస్థ MD వి.సి.సజ్జనార్ క్లారిటీ ఇస్తూ.. లోగో మార్పు అనేది తప్పుడు ప్రచారమని ‘X’ ద్వారా ట్వీట్ చేశారు.
ఫేక్ అంటూ…
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లోగో ఫేక్ అని సజ్జనార్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. కొత్త లోగోను సంస్థ తయారు చేస్తుందన్న ఆయన.. దానికి సంబంధించి ఇంకా ఫైనలైజ్ కాలేదని ట్వీట్ ద్వారా తెలిపారు.