
CM రేవంత్ రెడ్డి రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో చేపట్టే పర్యటనకు ఇంఛార్జి మంత్రులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వాతావరణ
పరిస్థితుల వల్ల ఈరోజు జరపాల్సిన వరంగల్ టూర్ ను రద్దు చేసుకున్నారు. అవసరమైన పడవల్ని అందుబాటులో ఉంచాలని, NDRF సిబ్బందిని తక్షణమే తరలించాలని CS, DGPల్ని ఆదేశించారు.
డ్రోన్లతో ఆహారం అందించాలన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రాకుండా చూడాలన్నారు. కలెక్టర్లు ఎప్పకప్పుడు సమాచారాన్ని ఇంఛార్జ్ మంత్రులకు తెలపాలని, కమాండ్ కంట్రోల్ రూంతో
అనుసంధానం చేసుకోవాలని CM స్పష్టం చేశారు.