CM అల్పాహార పథకం ఈ రోజు అధికారికంగా ప్రారంభమవుతున్నది. కొద్దిసేపట్లో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి దీనికి లాంఛనంగా శ్రీకారం చుడతారు. మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాలలో మంత్రులు ప్రారంభించనున్నారు. ఇవాళ నియోజకవర్గానికి ఒక స్కూల్ లో దీన్ని మొదలుపెట్టి దసరా హాలిడేస్ తర్వాత అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించడంతోపాటు డ్రాపవుట్స్ ను తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ కు శ్రీకారం చుట్టారు. అయితే బోర్ కొట్టే విధంగా కాకుండా మెనూను డిఫరెంట్ గా రూపొందించారు. నిత్యం రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంచుతుండగా అందులో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులకు మెనూ తయారైంది. రోజూ రెండు రకాల టిఫిన్స్ కు గాను ఒకటి ఎంచుకోవాల్సి ఉండగా, శుక్రవారం నాడు మాత్రం నాలుగింట్లో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
డిఫరెంట్ మెనూ ఇదే
- సోమవారం… ఇడ్లీ సాంబార్/గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
- మంగళవారం… పూరి ఆలూకుర్మ/ రవ్వతో టమాటా బాత్, సాంబార్
- బుధవారం… ఉప్మాసాంబార్/బియ్యపు రవ్వ కిచిడి, చట్నీ
- గురువారం… చిరుధాన్యాల ఇడ్లీ, సాంబార్/పొంగల్, సాంబార్
- శుక్రవారం… ఉగ్గాని/అటుకులు/చిరుధాన్యాల ఇడ్లీ, చట్నీ/గోధుమ రవ్వ కిచిడి, చట్నీ
- శనివారం… పొంగల్ సాంబార్/కూరగాయల పులావ్
టైమింగ్స్ ఇవే.. పూర్తిస్థాయిలో అబ్జర్వేషన్
- ఈ బ్రేక్ ఫాస్ట్ కోసం ప్రత్యేక టైమ్ కేటాయించగా.. 45 నిమిషాల పాటు విద్యార్థులకు అందించనున్నారు.
- హైదరాబాద్ జంట నగరాల్లో పొద్దున 8:45 గంటలకు బడులు స్టార్ట్ అయితే 8 గంటల నుంచే పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ ఇవ్వాలి.
- జిల్లాల్లో 9:30 బడులు ప్రారంభమైతే 8:45 గంటలకే అల్పాహార కార్యక్రమం మొదలవుతుంది.
- హైదరాబాద్ జంట నగరాల్లో ప్రార్థన సమయం 8:50 నుంచి 9 గంటల వరకు ఉంటుంది.
- జిల్లాల్లో ప్రార్థన సమయం 9:35 నుంచి 9:45 గంటల వరకు ఉంటుంది.
- బ్రేక్ ఫాస్ట్ ను కోఆర్డినేట్ చేసుకునేందుకు రోజుకో టీచర్ రొటేషన్ పద్ధతిలో చూసుకోవాల్సి ఉంటుంది.
- బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసిన పిల్లల వివరాల్ని ఆన్ లైన్ సాఫ్ట్ వేర్ యాప్ లో నమోదు చేయాలి.
- మెనూ క్వాలిటీని ప్రతి 15 రోజులకోసారి ఫుడ్ ఇన్స్ పెక్టర్లు తనిఖీ చేస్తారు.