కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది. రేషన్ కార్డులతోపాటు హెల్త్ కార్డుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. సెప్టెంబరు 17 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన నిర్వహించి కొత్త కార్డుల కోసం వివరాలు సేకరించబోతున్నారు. ఈ మేరకు గ్రౌండ్ లెవెల్ అధికారులను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మొదట విడతలో డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు ఆరు గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు స్వీకరించారు. ఈ విడత ప్రజాపాలనలో మాత్రం కేవలం రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసమే అప్లికేషన్లు స్వీకరించనున్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా వ్యక్తుల పూర్తి ఆరోగ్య వివరాలతో(Health Details) కూడిన ఫుల్ ప్రొఫైల్ హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నారు.