Published 27 Dec 2023
సచివాలయంలో మీడియా సమావేశాలు పెడతారని.. ముఖ్యమంత్రి, మంత్రులతో కూర్చోగలుగుతారని మీరైతే అనుకున్నరో లేదో గానీ ప్రజాప్రతినిధులుగా మేమే ఇక్కడకు రాలేకపోయామని CM రేవంత్ రెడ్డి విలేకరులతో అన్నారు. అడుగడుగునా పోలీసుల్ని పెట్టి పదేళ్ల పాటు రాచరిక వ్యవస్థను గుర్తు చేశారని గత ప్రభుత్వ తీరును విమర్శించారు. ప్రజాపాలనకు సంబంధించిన ఆరు గ్యారెంటీల లోగో, పోస్టర్ ను ఆవిష్కరించిన సందర్భంగా రేవంత్ మాట్లాడారు. లక్ష కోట్లు సంపాదించిన దాంట్లో లక్ష రూపాయలు ఇచ్చారంటే అది తమ ప్రజావాణి ఘనతేనంటూ మహిళకు KTR అందించిన సాయంపై చురకలంటించారు.
సభంతా బావ, బామ్మర్దులే…
మొన్నటి శాసనసభ సమావేశాల్లో(Assembly Sessions) బావ, బామ్మర్దుల తాపత్రయం తప్ప మిగతా ఒక్క సభ్యుడన్నా వాళ్లిద్దరి మాటల్ని సమర్థించారా అంటూ KTR, హరీశ్ తీరు గురించి ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు. లక్ష కోట్లలో ఒక లక్ష రూపాయలు మాత్రమే ఖర్చయిందని, మిగతాదాన్నంతా కక్కించే పనిలో ఉంటామని రేవంత్ గుర్తు చేశారు.