ట్రాన్స్ జెండర్లను హైదరాబాద్ ట్రాఫిక్ లో నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక నియామకాలు(Recruitments) చేపట్టాలన్నారు. GHMC పరిధిలోని అభివృద్ధి పనులపై వివరాలు తెలుసుకున్న CM.. తప్పుడు రిపోర్టులు ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ ను అదుపులోకి తేవడంలో ట్రాన్స్ జెండర్లను వలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలన్న రేవంత్.. హోంగార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఇందుకు ఇంట్రస్ట్ చూపించేవారి వివరాలు సేకరించాలన్నారు.