వరదల వల్ల తలెత్తిన నష్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మంలో మాట్లాడిన CM.. మొత్తంగా రూ.5,438 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం ఆదుకోవాలని, ప్రధానమంత్రి రాష్ట్రంలో పర్యటించి పరిస్థితుల్ని అంచనా వేయాలని మరోసారి కోరారు.
‘ప్రజల్లోకి వెళ్లడం ప్రతిపక్షాల బాధ్యత.. 10 సంవత్సరాలు CMగా పనిచేసిన KCR బాధితుల్ని పరామర్శించేందుకు రాకపోవడం బాధాకరం.. విదేశీ పర్యటన(America)లో ఎంజాయ్ చేస్తూ KTR ఇష్టమొచ్చినట్లు ట్వీట్లు చేయడం చిల్లర ప్రయత్నాలు..’ అంటూ రేవంత్ విమర్శించారు.
మృతిచెందిన వారికి రూ.5 లక్షలు, వరద బాధితులకు రూ.10 వేలు.. పశువులు మృతిచెందితే రూ.50 వేలు.. గొర్రెలు, మేకలు కోల్పోతే రూ.5 వేలు ప్రకటించామని… పంటలు కోల్పోయిన వారికి సైతం పరిహారం ఇస్తామన్నారు.