రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల(Hostels) పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించేందుకు ప్రభుత్వ పెద్దలంతా విజిట్ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా కీలక నేతలంతా హాస్టళ్లను పరిశీలిస్తారు. CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతికుమారితోపాటు మంత్రులు, సీనియర్ IAS, IPSలు గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను శనివారం నాడు పరిశీలిస్తారు. అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ఏదో ఒక హాస్టల్ కు ముఖ్యమంత్రి వెళ్తుండగా.. ఖమ్మం జిల్లా మధిరలోని MJPBCWR బాలికల జూనియర్ కళాశాలతోపాటు బోనకల్ హాస్టల్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిశీలిస్తారు.