AC గదుల(Rooms)కే పరిమితమైతే నిజమైన సంతృప్తి ఉండదని.. ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా ప్రజల మనసుల్లో కలెక్టర్లు చిరస్థాయిగా స్థానం సంపాదించాలని CM రేవంత్ రెడ్డి అన్నారు. అందరూ క్షేత్రస్థాయి(Ground Level)లో పర్యటించాల్సిందేనన్నారు.
మాస్టార్లలా…
కలెక్టర్లతో సచివాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి.. పలు కీలక సూచనలు చేశారు. కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల మనసుల్లో నిలిచిపోవాలని, ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలకు కీలకం మీరే అంటూ మాట్లాడారు. కొన్ని స్కూళ్లల్లో టీచర్లు వెళ్లిపోతుంటే పిల్లలు సొంత కుటుంబ సభ్యుడిగా చూస్తున్నారని, అలా ప్రజల నుంచి మీకు స్పందన రావాలని గుర్తు చేశారు.