మొన్నటి బడ్జెట్లో విద్యా(Education) శాఖకు 10 శాతం మేర రూ.30 వేల కోట్లు కేటాయించాలనుకున్నామని, కానీ అది వీలు కాలేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. అయినా 7.3 శాతంతో రూ.21,000 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. పదోన్నతులు(Promotions) పొందిన ఉపాధ్యాయులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ మాట్లాడారు. ఒకటో తేదీనే జీతాలిస్తామని హామీ ఇచ్చారు.
టీచర్లను తేనెటీగల్లా పోల్చిన CM.. ఎవరైనా రాయి వేస్తేనే ఎదురుతిరిగే మనస్తత్వం తేనెటీగలకు ఉన్నట్లే టీచర్లూ అనవసరంగా ఇంకొకరి జోలికి పోరు అని మాట్లాడారు. ఉపాధ్యాయుల్ని ముట్టుకుంటే ఎవరైనా భయపడతారు.. కానీ సమస్యల్ని పరిష్కరించాలన్న తపన ఉంటే టీచర్ల గురించి ఆలోచించడంలో ఏ మాత్రం తప్పులేదని, అందుకే వారి సమస్యలపై దృష్టిసారించామన్నారు.