సివిల్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో సాయం ప్రకటించింది. మెయిన్స్ పాసై ఇంటర్వ్యూకు అర్హత(Eligible) సాధిస్తే అప్పుడు మరో లక్ష రూపాయలు అందుతాయి. గతంలో హామీ ఇచ్చిన మేరకు మెయిన్స్(Mains)కు ఎంపికైన 135 మందికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరిట నిధులు అందజేశారు. మొత్తం 135 మందికి గాను ఒక్కో అభ్యర్థికి రూ.లక్ష చొప్పున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు.
సర్కారు చొరవతో తన CSR(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద సింగరేణి ఈ సాయాన్ని అందించింది. OBC కేటగిరీలో 62 మంది, SCల నుంచి 19 మంది, STల నుంచి 32 మంది ఉన్నారు. ఇందులో 22 మంది మహిళా అభ్యర్థులు.