ఇక సమరమే అంటూ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన వార్నింగ్ పై CM రేవంత్ స్పందించారు. ఆ సమరం ప్రజలపైనేనా అంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, రిటైర్డ్ సహా మొత్తం 9 లక్షల మంది ఉంటారని, ఈ 3 శాతం ఉద్యోగుల సమరం 90 శాతం మంది ప్రజలపైనా అంటూ ప్రశ్నించారు. ’10 సంవత్సరాల్లో ఎన్నడూ మొదటి తారీఖున జీతాలు తీసుకోలేదు.. రాష్ట్రం ధనికమైనా టైమ్ కు జీతాలివ్వలేదు.. 2023 డిసెంబరు 7 నుంచి 2025 మార్చి 31 నాటికి రూ.1.52 లక్షల కోట్ల వడ్డీ కట్టాం.. అసలు, వడ్డీ కలిపి నెలకు రూ.7 వేల కోట్లు కడుతున్నాం.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.8,500 కోట్లను గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది.. నెలనెలా జీతాలు ఒకెత్తు, 3 లక్షల మందికి పెన్షన్లు మరో ఎత్తు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకో ఎత్తు..’ అని రేవంత్ గుర్తు చేశారు.