ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చాలా సూచనలు వచ్చాయని CM రేవంత్.. విద్యపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా శాసనమండలిలో తెలిపారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసే వ్యక్తులు తమ పిల్లల్ని సర్కారీ బడుల్లోనే చదివించాలంటూ MLC తీన్మార్ మల్లన్న తన దృష్టికి తెచ్చారన్నారు. రేవంత్ మాట్లాడుతుండగా మండలి ఛైర్మన్ సైతం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. టీచర్లతో కొట్లాడే శక్తి రాలేదంటూ సరదాగా ప్రసంగించారు రేవంత్.
వారి మాటల్లోనే…
రేవంత్….: ‘ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ కు ఇద్దరు పిల్లల నిబంధన తెచ్చారు.. ఈ నిబంధన తొలగిస్తే బాగుంటుందని కొందరంటున్నారు.. లోకల్ బాడీల్లో పోటీ చేసే వ్యక్తుల పిల్లలు ప్రభుత్వ బడుల్లోనే చదవాలని MLC చెప్పారు.. తమ పిల్లలు బాగా చదివేందుకు లోకల్ లీడర్లు దృష్టిపెడతారు..’.
గుత్తా సుఖేందర్ రెడ్డి…: ‘ప్రభుత్వ బడుల్లో పనిచేసే టీచర్ల పిల్లలు కూడా చదివితే బాగుంటుంది..’. https://justpostnews.com
రేవంత్….: ‘కరెక్టే సర్.. ఛైర్మన్ సర్.. అంత మాట అనే ధైర్యం నాకు లేదు.. మీరందరూ సూచన చేస్తే మాత్రం నిర్ణయం తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు.. కావాలంటే రాజకీయ ప్రత్యర్థులు, ప్రజాప్రతినిధులతో మేం కొట్లాడగలం కానీ టీచర్లతో కొట్లాడే శక్తి ఇంకా రాలేదు.. ఇవన్నీ కూడా చర్చ కోసం ఓపెన్ అవ్వాలనేదే నా పాయింట్.. టీచర్లు అనే కాకుండా ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే వాళ్ల పిల్లలు సర్కారీ బడుల్లో చదవాలన్న నిబంధన పెడితే ఏదైనా ఉపయోగముంటదేమో.. నా దగ్గరకొచ్చిన విషయాల్ని సభ ముందు పెడ్తున్నా..’.