పోలీసుల పిల్లల కోసం 50 ఎకరాల్లో ఏర్పాటు చేసే రెసిడెన్షియల్ స్కూలును రెండేళ్లలోనే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే రెండేళ్లలో పోలీసు స్కూలు ఉండాల్సిందేనన్న ఆయన.. DGP నుంచి హోంగార్డు వరకు ఏ హోదా అయినా అందరి పిల్లలూ ఒకే చోట చదువుకోవాలని అభిప్రాయపడ్డారు.
వరద బాధితుల కోసం పోలీసు శాఖ భారీ విరాళం అందించింది. రూ.11.06 కోట్ల చెక్కును CM సహాయనిధికి DGP జితేందర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు రేవంత్ కు అందించారు. TGPSCపై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు లేవన్న CM.. అభ్యర్థుల కోరిక మేరకే గ్రూప్-2 పరీక్షల్ని వాయిదా వేశామన్నారు.