అన్ని మండలాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేయాలని CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ బాధ్యత జిల్లాల ఇంఛార్జి మంత్రులు, MLAలదేనన్నారు. ఈనెల(జులై) 25 నుంచి వచ్చే నెల(ఆగస్టు) 10 వరకు కార్డులు అందించేలా కలెక్టర్లు చూడాలన్నారు. ఉమ్మడి జిల్లా ఇంఛార్జి మంత్రి కచ్చితంగా ఒక్కో నియోజకవర్గంలోని ఒక మండలానికి హాజరు కావాల్సిందేనన్నారు. దీనివల్ల కార్డులు ఇస్తున్నారన్న సమాచారం ప్రజలకు చేరుతుందన్నారు. ఇక కలెక్టర్లు అన్ని మండలాలు కచ్చితంగా పర్యటించాల్సిందేనని, MLAలతో సమన్వయం చేసుకోవాలన్నారు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com