విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్ని మూసివేస్తున్నారన్న(Close) ప్రచారం సరికాదని, అలాంటి ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పిల్లల సంఖ్యను బట్టి స్కూళ్లను మూసివేయడం చేస్తే పేదలకు విద్య దూరమవుతుందన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యను దూరం చేసే హక్కు ఎవరికీ లేదని DSC ఫలితాల విడుదల సందర్భంగా గుర్తు చేశారు. ప్రైవేటు విద్యాలయాల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ వేయబోతున్నామని CM తెలిపారు.