అభివృద్ధి విషయంలో ఎవరితోనైనా సఖ్యత(Friendly)గానే ఉంటామని, గత BRS ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో అన్నిచోట్లా అభివృద్ధి ఆగిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. కేంద్రప్రభుత్వం(Union Government)తో కొట్లాట కోసమే కేసీఆర్ ప్రభుత్వానికి టైమ్ సరిపోయిందని, అందుకే అభివృద్ధి విషయంలో ఎలాంటి భేషజాలకు పోకుండా ముందుకు వెళ్లాలన్నదే తమ ప్రాధాన్యమన్నారు. రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన CM.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను గుర్తు చేశారు.
ప్రధానిని కలవొద్దా…
వికారాబాద్ జిల్లా పూడూరు వద్ద నావికాదళాని(Navy)కి సంబంధించిన భూములు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రక్షణ శాఖ భూముల విషయంలో గత BRS ప్రభుత్వం గిల్లికజ్జాలు పెట్టుకుందని, అందుకే ఎక్కడికక్కడ ప్రాజెక్టులు ఆగిపోయాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వమైనా లేదా ఇంకెవరి సర్కారుకైనా సహకరించేందుకు తాము ఒక మెట్టు దిగడానికి ఎలాంటి సందేహాలు పెట్టుకోలేదన్నారు. KCR హయాంలో డ్రగ్స్, గంజాయి, పబ్బులు మాత్రమే డెవలప్ అయ్యాయన్నారు.