ప్రభుత్వ బడుల్లోనే చదివి సర్కారీ టీచర్లయిన వారికి సమాజం(Society) పట్ల ఎంతో అవగాహన ఉంటుందని CM రేవంత్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో మాట్లాడారు. ‘ప్రైవేటు స్కూళ్ల కంటే గవర్నమెంట్ టీచర్లు చాలా విద్యాధికులని నేనంటే ప్రైవేటు స్కూళ్లని అవమానించిండ్రంటూ కొంతమంది విమర్శించారు.. నేను అవమానించలే, పోల్చి చెప్పిన.. ఈరోజు కూడా సూచన ఒక్కటే.. ప్రైవేటు కంటే ప్రభుత్వ టీచర్లే విద్యాధికులు. సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్లు..’ అని ప్రశంసించారు. టీచర్లు మధ్యాహ్న భోజనం తింటే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.