సంధ్య థియేటర్ విషయంలో సంబంధం లేని పోలీసులు ఈ అంశం(Issue)పై స్పందించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. అలాంటి వారిపై దృష్టిపెట్టాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న ఆయన.. అల్లు అర్జున్ పై ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు చేస్తుండటాన్ని గమనించే వార్నింగ్ ఇచ్చారన్న మాటలు వినపడుతున్నాయి. విష్ణుమూర్తి అనే ACP.. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి అల్లు అర్జున్ ను తీవ్రంగా విమర్శించారు. నిజామాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ లో DCPగా పనిచేస్తున్న సమయంలో ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేసి ఈ అక్టోబరులో DGP కార్యాలయానికి అటాచ్డ్ చేశారు.
పై అధికారులకు ఎలాంటి సమాచారమివ్వకుండా రూల్స్ అతిక్రమించి ప్రెస్ మీట్ పెట్టడంపై ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతున్నారు. విష్ణుమూర్తిపై చర్యలు తీసుకోవాలంటూ DGPకి హైదరాబాద్ సెంట్రల్ జోన్ DCP అక్షాంశ్ యాదవ్ లెటర్ రాశారు. ఇలాంటి పరిణామాలు జరిగిన దృష్ట్యా CM రేవంత్ రెడ్డి పోలీసు శాఖకు ప్రత్యేక ఆదేశాలిచ్చారు.