ఇళ్లల్లోకి వరద.. పైన తలదాచుకుందామంటే ఎడతెరిపిలేని వర్షం.. తినడానికి తిండి లేక.. చుట్టూ జలమే(Water) అయినా తాగడానికి మంచినీళ్లు లేక.. పసి పిల్లలు, వృద్ధులతోపాటు ప్రజలు పడే యాతన నరకం. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితి దారుణంగా తయారైంది. వేలాది మంది బాధితులు ఆపన్నహస్తం(Help) కోసం ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని పరిశీలించేందుకు CM రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన చేపట్టారు. తొలుత హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ నిర్వహించిన ఆయన.. అక్కణ్నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం వెళ్తున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి బాధితుల్ని పరామర్శిస్తారు. వర్ష ప్రభావం, నష్టం అంచనా, సహాయక చర్యలను పరిశీలిస్తారు. సీఎం రాకతోనైనా తమ పరిస్థితి మారుతుందని బాధితులు ఆశతో ఉన్నారు.